రేవంత్ రెడ్డిపై కేసు కొట్టేసిన న్యాయస్థానం..! 1 y ago
TG: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. జన్వాడలో డ్రోన్ ఎగురవేసిన ఘటనకు సంబంధించి 2020 మార్చిలో నార్సింగి పీఎస్లో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. దీంతో ఆయనను అప్పట్లో నార్సింగి పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు FIRను క్వాష్ చేయాలని రేవంత్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనల సందర్భంగా జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని సీఎం తరఫు న్యాయవాది తెలిపారు. తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని వెల్లడించారు.